
- స్టేట్ బ్యాంక్ హోంలోన్లపై వడ్డీరేటు@6.8%
- వచ్చే నెల దాకా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
న్యూఢిల్లీ: హోంలోన్ తీసుకోవాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ స్వీట్ న్యూస్ చెప్పింది. హోంలోన్లపై వడ్డీరేట్లు అతితక్కువగా 6.8 శాతం నుంచి వసూలు చేస్తున్నామని వెల్లడించింది. వచ్చే నెలాఖరుదాకా ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేస్తామని వెల్లడించింది. అయితే లోన్ రకాన్ని బట్టి వడ్డీరేటు మారే అవకాశం ఉంది. ఈ బ్యాంకు.. గవర్నమెంటు ఎంప్లాయిస్ కోసం ‘ప్రివిలేజ్ హోంలోన్’, ఆర్మీ వాళ్ల కోసం ‘శౌర్య’, తన కస్టమర్ల కోసం మ్యాక్స్ గేన్, స్మార్ట్ హోమ్, టాప్–అప్లోన్లు ఇస్తోంది. ఖరీదైన ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కోసం ఎన్ఆర్ఐ హోంలోన్, ఫ్లెక్సీ పే లోన్లు ఉన్నాయి. మహిళల కోసం ‘హెర్ ఘర్ హోంలోన్’ ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం 7208933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని బ్యాంకు సూచించింది. ‘‘ప్రాసెసింగ్ ఫీ వంటి ఫ్రింజ్ కాస్టుల వల్ల బారోవర్‌పై భారం ఎక్కువ అవుతుంది. స్టేట్ బ్యాంకు లాంటివి ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేయడమేగాక, తక్కువ వడ్డీరేట్లకు హోంలోన్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రాపర్టీల రేట్లు తక్కువగానే ఉన్నాయి. స్టాంప్‌డ్యూటీ, సర్కిల్ రేట్లలోనూ రిడక్షన్లు ఇవ్వడం వల్ల ఇల్లు కట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇక ముందు కూడా బ్యాంకులకు హోంలోన్ కస్టమర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది”అని హౌజింగ్డాట్కామ్గ్రూప్సీఓఓ మణి రంగరాజన్ అన్నారు. మనదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్బీఐ 34 శాతం వాటాతో హోంలోన్ సెగ్మెంట్లోనూ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. రోజుకు దాదాపు వెయ్యి హోంలోన్ అప్లికేషన్లను ప్రాసెస్ చేస్తుంది.