
పలెల్లు, పట్టణాలు.. రైతులు, చిన్న వ్యాపారుల కోసం..
పలెల్లకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు
వేగంగా చిన్న అప్పులు
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ, సెమి అర్బన్‌ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత పెంచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ‘ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో మార్కెట్(ఎఫ్‌ఐ&ఎంఎం)’ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా అగ్రికల్చర్, అనుబంధ రంగాలకు, చిన్న పరిశ్రమలకు ఈ విభాగం ద్వారా అప్పులను ఇవ్వనున్నారు. రైతులకు, చిన్న వ్యాపారాలకు అప్పులు(మైక్రో ఫైనాన్స్‌కూడా), ప్రత్యేకమైన సేవలను అందించేందుకు ఇప్పటికే ఎనిమిది వేలకు పైగా బ్రాంచులను గుర్తించామని ఎస్‌బీఐ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. దేశంలో బ్యాంక్‌కి ఉన్న 63,000 కస్టమర్‌పాయింట్ల ద్వారా సర్వీస్ క్వాలిటీని మరింత పెంచడానికి స్టేట్ బ్యాంక్ అనేక చర్యలను తీసుకుంటోందని తెలిపింది. మైక్రో ఫైనాన్స్ సెక్టార్‌కు ఈ కొత్త విభాగం బూస్టప్ ఇస్తుందని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎస్‌బీఐ మద్దతుగా ఉంటుందని బ్యాంక్ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. వివిధ వ్యాపారాలకు మద్దతుగా నిలవడమే ఈ కొత్త విభాగం లక్ష్యమని అన్నారు. అంతేకాకుండా కస్టమర్ సర్వీస్‌లను మరింత మెరుగుపరచడానికి ఈ విభాగం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రిమోట్ ఏరియాలలో ఉన్న ప్రజలకు కూడా ఫైనాన్షియల్ సేవలను అందించేందుకు ఎస్‌బీఐ ఈ చొరవ తీసుకుందని అన్నారు. ఈ కొత్త ఎఫ్‌ఐ& ఎంఎం విభాగం ద్వారా చిన్న వ్యాపారాలకు, అగ్రి, అనుబంధ రంగాలకు మరిన్ని సేవలను అందించడానికి వీలుంటుందని రజనీష్ కుమార్‌చెప్పారు. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులలో చిన్న వ్యాపారాలకు ఇది మద్ధతుగా ఉంటుందని పేర్కొన్నారు. లోకల్‌లెవెల్‌లో స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, రీజినల్ మేనేజర్స్, డిస్ట్రిక్ట్ సేల్స్ హబ్(డీఎస్‌హెచ్) వంటి నాలుగు డివిజన్ల కింద ఈ విభాగం పనిచేస్తుంది. క్రెడిట్ డెలివరీ సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి, తొందరగా లోన్‌మంజూరు కావడానికి, స్మాల్ లోన్స్‌ను పంపిణీ చేయడానికి ఈ వ్యవస్థ కృషి చేస్తుందని ఎస్‌బీఐ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఎఫ్‌ఐ&ఎంఎం నెట్‌వర్క్‌లో డిస్ట్రిక్ట్ సేల్స్ హబ్‌లు కీలకంగా ఉంటాయని తెలిపింది. ఇవి సేల్స్, రికవరీని చూసుకుంటాయని పేర్కొంది. ఈ డీఎస్‌హెచ్‌లు కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు కస్టమర్ సర్వీస్ పాయింట్లకు సాయపడతాయని తెలిపింది. కరోనా టైమ్‌లో చిన్న వ్యాపారాలను ఆదుకునేందుకు ఎస్‌బీఐ అనేక చర్యలను తీసుకుంటోంది. ఈ బ్యాంక్ ‘కామన్ కోవిడ్19 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్’ ద్వారా చిన్న వ్యాపారాలకు ఎమర్జెన్సీ లోన్స్‌ను ఇస్తోంది. టెర్మ్‌లోన్స్‌పై మారటోరియం కూడా అందిస్తోంది.
ఎస్‌బీఐ కార్డు
లాక్‌డౌన్‌లో కూడా ప్రజలు క్రెడిట్ కార్డులను ఫుల్‌గా వాడారని ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ చెప్పింది. మే నెలలో రోజుకు సగటున రూ.175 కోట్లను యూజర్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఎస్‌బీఐ కార్డు పేరుతో క్రెడిట్ కార్డు సర్వీసులను ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేస్తోంది. తొలి లాక్‌డౌన్ నుంచి వ్యాపారాల కొనసాగింపుపై దృష్టి పెట్టిన ఎస్‌బీఐ కార్డు, ఇప్పటి వరకు తన బిజినెస్ ఆపరేషన్స్‌ను కంటిన్యూగా పెంచుకున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను ఎస్‌బీఐ కార్డు అనాలసిస్ చేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. కంటిన్యూగా కస్టమర్‌తో ఎంగేజ్‌అవడం క్రెడిట్ కార్డుకు ఒక అడ్వాంటేజ్‌గా నిలిచినట్టు ఎస్‌బీఐ కార్డు పేర్కొంది. దీని ఫలితంగా క్రెడిట్ కార్డులపై చేసే ఖర్చులు లాక్‌డౌన్‌లో కంటిన్యూగా పెరిగాయని, ఆన్‌లైన్, మర్చెంట్ అవుట్‌లెట్లు ఈ కాలంలో తెరిచే ఉన్నాయని చెప్పింది. లాక్‌డౌన్ నిబంధనల్లో కాస్త సడలింపులు ఇవ్వడంతో మే నెలలో సగటున రోజూ ఖర్చు చేసిన మొత్తం రూ.175 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2020 క్యూ4లో అంటే 2020 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న కాలంలో ఈ ఖర్చులు రూ.290 కోట్లుగా ఉన్నట్టు ఎస్‌బీఐ కార్డు తెలిపింది. మే నెలలో చివరి ఏడు రోజుల్లో రోజువారీ ఖర్చులు రూ.200 కోట్లకు పైగా పెరిగినట్టు వెల్లడించింది.
For More News..