
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో స్వదేశానికి మద్దతుగా ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఇక్సిగో తన సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. టర్కీ, అజర్ బైజాన్, చైనాలకు అన్ని విమాన, హోటల్ బుకింగ్ లను నిలిపివేలయాలని నిర్ణయించింది.
For the love of our nation, we stand united. pic.twitter.com/GqKKzQ4as9
— ixigo (@ixigo) May 10, 2025
మాదేశానికి సంఘీభావంగా టర్కీ, అజర్ బైజాన్, చైనాలకు విమన, హోటల్ బుకింగ్ లను నిలిపివేస్తున్నాం అని ఇక్సిగో తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో ప్రకటించింది. సవాళ్లతో కూడిన సమయంలో భారత్ లతో నిలబడేందుకు విమాన, హోటల్ బుకింగ్ లను నిలిపివేస్తున్నామని తెలిపింది. ఇటీవల టర్కీ, అజర్ బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలు భారత్ కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు మద్దతుగా ప్రకటించాయి. ఈ క్రమంలో ఇక్సిగో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్, పాక్ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 32 ఎయిర్ పోర్టులను మూసివేస్తున్న ట్లు భారత్ ప్రకటించింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన ఉత్తర, పశ్చిమ భారత్ లోని అన్ని రకాల పౌర విమానాలు రద్దుచేస్తున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్త (AAI) ప్రకటించింది.
►ALSO READ | కార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే పలు విమానయాన సంస్థలు కూడా ప్రభావిత ప్రాంతాలకు విమానాలను రద్దు చేశాయి. జమ్మూ, శ్రీనగర్,లేహ్, జోధ్పూర్, అమృత్ సర్,చండీగఢ్,భుజ్,జామ్ నగర్, రాజ్ కోట్ లకు అన్ని విమానాలను రద్దు చేసింది.
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల క్రమంలో ఇప్పటికే పలు దేశాలు ఇండియాకు మద్దతు ప్రకటించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు సపోర్టు ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులను సమర్ధించాయి. భారత్ ఇప్పటికే అనేక పాక్ ఉగ్ర స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసింది.