కార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ

కార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ

ఆపరేషన్ సిందూర్ సక్సెక్ కావడం.. పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుండటం, పాక్ కీలక బేస్ క్యాంపులను ధ్వంసం చేయడం.. ఇవన్నీ చూసి పాకిస్తాన్ కు కంటిమీద కునుకు లేకుండా అయినట్లుంది. పాక్ ఎత్తులను చిత్తు చేయడంతో పాటు ఒక్క పాచిక కూడా పారనీయకుండా ఇండియా విజృంభిస్తుండటంతో.. పాక్ వెర్రిగా ప్రవర్తిస్తోంది. భారత్ తో పెట్టుకుంటే తీవ్ర నష్టం తప్పదని తెలిసి కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 

పాక్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్, డ్రోన్స్ లను నిర్వీర్యం చేస్తుండటంతో.. ఇక నియంత్రణ రేఖ వైపు బలగాలను పంపుతున్నట్లు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ ఎత్తున బలగాలను సరిహద్దు ప్రాంతాల వైపు తరలిస్తున్నట్లు తెలిపింది. 1999- కార్గిల్ వార్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున సేనలను మోహరించడం ఇది తొలిసారి అని తెలిపింది. 

శనివారం (మే 10) ఇండియాకు చెందిన 26 మిలిటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. వీటితో పాటు నాలుగు రాష్ట్రాలలోని కీలక స్థలాలను లక్ష్యంగా చేసుకుంది. పాక్ కుట్రలను ముందుగానే గమనించి చిత్తు చేసింది ఇండియా. ఆ తర్వాత ప్రతిదాడిగా పాక్ కు చెందిన 6 ఎయిర్ బేస్ లను కూల్చేసింది. 

ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ భారీ ఎత్తున బలగాలను బార్డర్ వైపు తరలిస్తున్నట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత్ పై భారీ దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో పాక్ బలగాలు కదులుతున్నాయని, ముందుగానే గమనించి ఎదుర్కొనేందుకు ఇండియన్ ట్రూప్స్ సిద్ధమయ్యాయని చెప్పారు. 

►ALSO READ | మసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..

భారత్ పై యుద్ధం ప్రారంభిస్తున్నామని ఇప్పటికే పాక్ ప్రకటించిన  విషయం తెలిసిందే. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది పాక్. శనివారం ( మే 10 ) నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు ఆ దేశ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ. ఈ క్రమంలో పాక్ దాడులను మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇక పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడి చేసినట్లు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తో పాటు మురిద్‌, షార్‌కోట్‌ వైమానిక స్థావరాలపై భారత్‌ దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే భారత ఆర్మీ దాటికి విలవిలలాడుతున్న పాక్.. ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారింది. ఈ పరిస్థితిలో ప్రత్యక్ష యుద్దానికి సిద్దమైన పాక్.. భారత్ దాడిని ఏమేరకు ఎదుర్కొంటుందో చూడాలి.