ఇంటి లోన్​తో పాటే సోలార్​ ప్యానెళ్లు

ఇంటి లోన్​తో పాటే సోలార్​ ప్యానెళ్లు
  • ఇంటి లోన్​తో పాటే సోలార్​ ప్యానెళ్లు
  • ఎస్​బీఐ నిర్ణయం

ముంబై : ఇక నుంచి ఇవ్వబోయే హౌసింగ్​ లోన్లకు పైకప్పు సోలార్​ ఇన్​స్టాలేషన్లను తప్పనిసరి చేయాలని ఎస్​బీఐ నిర్ణయించింది. మల్టీలేటర్​ ఏజెన్సీల నుంచి తీసుకున్న లాంగ్​ టర్మ్​ క్లైమేట్​ యాక్షన్​ ఫండ్స్​ నుంచి ఇచ్చే లోన్లకు ఈ రూల్​ వర్తిస్తుంది. ఈ ఏడాది జూన్​ నాటికి ఎస్​బీఐ హోంలోన్​ బుక్​ విలువ రూ.6.3 లక్షల కోట్లు కాగా, మల్టిలేటరల్​ ఏజెన్సీల నుంచి తీసుకున్న అప్పుల విలువ 2.3 బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.19,119 కోట్లు) ఉంది.

ALSO READ: విముక్త పోరాట వీరుల యాదిలో..సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం

వరల్డ్​బ్యాంక్​, ఆసియన్​ డెవెలప్​మెంట్​ బ్యాంక్​, కేఎఫ్​డబ్ల్యూ వంటి ఏజెన్సీల నుంచి ఈ డబ్బును తీసుకుంది. గ్రీన్​ఫండ్స్​ నుంచి లోన్​ ఇస్తే రూఫ్​ టాప్​ సోలార్​ ఇన్​స్టాలేషన్లను అమర్చుకోవాల్సి ఉంటుందని ఎస్​బీఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్​ అశ్వినీ కుమార్​ తివారీ చెప్పారు. 10 ఏళ్లు, 20 ఏళ్ల వ్యవధితో ఇలాంటి లోన్లను ఇస్తామని చెప్పారు. గ్రీన్​బిల్డింగ్స్​కు, బ్యాటరీ రీసైక్లింగ్​కు, సోలార్​ రూఫ్​టాప్​లకు లోన్లను భారీగా పెంచుతున్నామని ఆయన వివరించారు.