SBI కొత్త యాప్ : ఛార్జీలు లేకుండా ATMలో డబ్బులు విత్ డ్రా

SBI కొత్త యాప్ : ఛార్జీలు లేకుండా ATMలో డబ్బులు విత్ డ్రా

ATMలో చీటికి మాటికి డబ్బులు విత్ డ్రా చేయడం..తద్వారా 5 లిమిట్స్ అయిపోవడం.. తర్వాత ఎక్స్ ట్రా ఛార్జీలు వేయడం బ్యాంకులకు పరిపాటే. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ ఖాతాదారుల కోసం SBI ఓ యాప్ తీసుకువచ్చింది. ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించకుండా ATMల నుంచి ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చుసుకునే సౌకర్యాన్ని SBI తన ఖాతాదారులకు  అందుబాటులోకి తెచ్చింది.

అయితే SBI యోనో యాప్ ద్వారా యోనో క్యాష్ పాయింట్లున్న ATMలలో మాత్రమే ఛార్జీలు లేకుండా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉండగా..దీని ద్వారా కార్డ్ లెస్ విత్ డ్రాలు పెరుగుతాయని SBI అంచనా వేస్తుంది. ఈ యాప్ ద్వారా రోజులు రూ.20 వేలు, ఒకేసారి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చని తెలిపింది SBI.