
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మరోసారి యూకే హైకోర్టు తలుపు మరోసారి తట్టింది. మాల్యా కేసుకు సంబంధించి బ్యాంకుల వద్ద సెక్యూరిటీలుగా ఉన్న ఇండియన్ ఆస్తులను లోన్లకు బదులుగా స్వాధీనం చేసుకునేందుకు అవకా శం ఇవ్వాలని కోరింది. బ్యాంకులిచ్చిన లోన్లు పబ్లిక్ మనీ అని, సెక్యూరిటీలను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులకు ఎటువంటి అధికారం లేదని మాల్యా లాయర్ వాదించారు. చీఫ్ ఇన్‌సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్(ఐసీసీ) జడ్జ్ మైకల్ బ్రిగ్స్ ముందు వర్చువల్‌గా ఈ కేసు హియరింగ్ జరిగింది. ఒక కమర్షియల్ బ్యాంకుగా, తన దగ్గరున్న సెక్యూరిటీని ఏం చేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం బ్యాంకులకు ఉందని ఎస్‌బీఐ కాన్సార్టియం తరపు లాయర్ వాదించారు. పబ్లిక్ మనీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ వంటి అంశాలు ఇండియాలో ఉండడంతో, ఇంగ్లండ్‌లోని చట్టాలకి అనుగుణంగా బ్యాంక్ట్రప్సీ ఆర్డర్‌ను ఇవ్వాలని కోరారు. కాగా, ఈ కేసును కోర్టు వాయిదా వేసింది.