బ్యాంక్ జాబ్స్ : హైదరాబాద్ SBIలో 525 ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ జాబ్స్ : హైదరాబాద్ SBIలో 525 ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 8283 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) ఉద్యోగాల భర్తీని ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌లో 525 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు లేదా చివరి సంవత్సరం/సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పోస్టులకు దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. అయితే, SC/ ST/PWD అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా, ఈ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 7.

SBI తాత్కాలికంగా జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్షను జనవరి 2024లో నిర్వహించాల్సి ఉండగా, ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 2024లో నిర్వహించాల్సి ఉంది. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.