ఎస్​బీఐకి మరో 300 బ్రాంచ్​లు

ఎస్​బీఐకి మరో 300 బ్రాంచ్​లు

న్యూఢిల్లీ:  ఎస్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 300 బ్రాంచ్‌‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,405 బ్రాంచ్​లు,  235 విదేశీ బ్రాంచ్​లు, ఆఫీసులు ఉన్నాయి. "మేం మా డిజిటల్ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నాం.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 300 బ్రాంచ్​లను తెరుస్తాం. 

అవి ఎక్కడ అవసరం అనేది త్వరలోనే నిర్ణయిస్తాం. మరింత మంది బిజినెస్ కరస్పాండెంట్‌‌‌‌‌‌‌‌లను కూడా నియమించుకుంటాం”" అని ఎస్​బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ దాదాపు 3.5 శాతంగా ఉంటుందని తెలిపారు. 

ఎన్​పీఏలు తగ్గడం, లోన్లు పెరగడం, అధిక వడ్డీ రేటు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ రూ.16,884 కోట్ల లాభాన్ని సాధించింది.