ఎస్​బీఐ‑పోస్టాఫీసు వడ్డీ రేట్లు..వీటిలో ఏది బెస్ట్?

ఎస్​బీఐ‑పోస్టాఫీసు వడ్డీ రేట్లు..వీటిలో ఏది బెస్ట్?

బిజినెస్ డెస్క్, వెలుగు: డబ్బు పొదుపు అనగానే మన మధ్యతరగతి జనానికి ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లు గుర్తుకు వస్తాయి. వీటితో తక్కువ -రాబడే వచ్చినా ఎఫ్​డీలు రిస్క్ లేని అసెట్ క్లాస్ కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తారు.  కస్టమర్ల అవసరాలను బట్టి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలానికి వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రముఖ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేట్లను అందించే పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఎఫ్​డీ స్కీములు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితి, బ్యాంకు, ప్రభుత్వ విధానాలను బట్టి రేట్లు క్వార్టర్​కు ఒకసారి మారుతాయి. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అందించే టర్మ్ స్కీమ్‌‌‌‌లు కూడా రిస్క్ లేని పెట్టుబడి సాధనాలే. ఈ బ్యాంక్ అందించే ఎఫ్డీల కాలపరిమితి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. దేశంలోనే పెద్ద బ్యాంకు కాబట్టి ఎక్కువ మంది బ్యాంక్ కస్టమర్లకు ఇది నమ్మకమైనది. చాలా మందికి ఎఫ్​డీల విషయంలో ఇది మొదటి ఆప్షన్. పోస్టు ఆఫీసులు కూడా ఎన్నో ఏండ్ల నుంచి ప్రజల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాయి. దాదాపు ప్రతి చోటా వీటి సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఏమీ లేదు. ఈ రెండింటి ఎఫ్​డీలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

స్టేట్ బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు.....
దీని ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ స్కీమ్‌‌‌‌లను పోస్ట్ ఆఫీస్ ఎఫ్​డీ స్కీమ్‌‌‌‌లతో పోల్చితే మరిన్ని ఎక్కువ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇండియా పోస్ట్‌‌‌‌తో ఎఫ్​డీకి కనీస కాలపరిమితి ఒక సంవత్సరం అయితే, స్టేట్ బ్యాంకులో వారానికి కూడా ఎఫ్​డీ చేసుకోవచ్చు.  వడ్డీ రేటు  బ్యాంకు డిపాజిట్ కాలపరిమితి ఆధారంగా 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య మారుతూ ఉంటుంది.

పోస్టాఫీస్ ఎఫ్​డీ వడ్డీ రేటు...
సాధారణంగా పోస్టాఫీస్ ఎఫ్​డీ రేట్లు ప్రతి క్వార్టర్లో మారుతాయి. అయితే ఏప్రిల్ 1, 2020 నుండి వీటిని ఇంకా మార్చలేదు. ఒక సంవత్సరం ఎఫ్​డీ స్కీమ్ కోసం ఇది 5.5 శాతం వడ్డీ ఇస్తుంది. కొన్నింటికి వడ్డీ 6.7 శాతం వరకు ఉంది.
ఎఫ్​డీ టెనార్        వడ్డీ
1 సంవత్సరం -    5.5 శాతం
2 సంవత్సరాలు     -5.5 శాతం
3 సంవత్సరాలు     -5.5 శాతం
5 సంవత్సరాలు     -6.7 శాతం

రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఎఫ్​డీ వడ్డీ రేటు
ఎఫ్​డీ టెన్యూర్లు        వడ్డీరేటు
7 రోజుల నుండి 45 రోజుల వరకు -     2.9 శాతం
46 రోజుల నుండి 179 రోజులు -     3.9 శాతం
180 రోజుల నుండి 210 రోజులు -     4.4 శాతం
211 రోజుల నుండి ఏడాది        4.4 శాతం
ఏడాది–రెండేళ్ల కంటే తక్కువ    5 శాతం 
రెండేళ్లు–3 సంవత్సరాల కంటే తక్కువ     5.1 శాతం
3 ఏళ్లు–ఐదేళ్లు         5.3 శాతం 
ఐదేళ్లు–పదేళ్లు         5.4 శాతం