74 శాతం పెరిగిన ఎస్బీఐ లాభం

74 శాతం పెరిగిన ఎస్బీఐ లాభం
  • అత్యధిక క్వార్టర్లీ ప్రాఫిట్​
  • క్యూ2 లాభం రూ. 13,265 కోట్లు
  • నికర వడ్డీ ఆదాయం 
  • రూ. 35,183 కోట్లు

 

వెలుగు బిజినెస్​ డెస్క్​ స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా పనితీరు సెప్టెంబర్​ 2022 క్వార్టర్లో అదిరిపోయింది. ఈ క్యూ2లో ఎస్​బీఐ లాభం ఏకంగా 74 శాతం పెరిగింది. మునుపెన్నడూ లేనంత క్వార్టర్లీ లాభాన్ని ప్రకటించింది.  సెప్టెంబర్​ 2022తో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుకు రూ. 13,265 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో ఈ నికర లాభం రూ. 7,627 కోట్లు మాత్రమే. తాజా క్యూ2లో ఎస్​బీఐకి రూ. 10,616 కోట్ల లాభం వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు మించిన ఫలితాలను ఎస్​బీఐ శనివారం ప్రకటించింది. క్యూ2లో ఆపరేటింగ్​ ప్రాఫిట్​ సైతం 17 శాతం పెరిగి రూ. 21,120 కోట్లకు చేరింది. 

నెట్​ ఇంటరెస్ట్​ ఇన్​కం పెరిగింది
స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నికర వడ్డీ ఆదాయం (నెట్ ఇంటరెస్ట్​ ఇన్​కం) సెప్టెంబర్​ 2022 క్వార్టర్లో 12.8 శాతం గ్రోత్​తో రూ. 35,183 కోట్లయింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​ క్వార్టర్లో ఈ నికర వడ్డీ ఆదాయం రూ. 31,184 కోట్లు. నెట్​ ఇంటరెస్ట్​ మార్జిన్లు కూడా 3.55 శాతానికి పెరిగాయి. కిందటేడాది క్యూ2లో ఇది 3.5 శాతంగా రికార్డయింది. బ్యాంకు ఆర్జించిన మొత్తం వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 79,860 కోట్లకు చేరడం విశేషం. 

లోన్లు, డిపాజిట్లు
ఎస్​బీఐ 20 శాతం క్రెడిట్​ గ్రోత్​ సాధించింది. దేశంలో ఇచ్చిన అప్పులు 18.15 శాతం గ్రోత్​ రికార్డు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని బ్యాంకు తెలిపింది. కార్పొరేట్లకు ఇచ్చిన అప్పులే కాకుండా, రిటెయిల్​ అప్పులు కూడా బాగా పెరుగుతున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇదే సమయంలో డిపాజిట్లు కూడా 10 శాతం పెరిగినట్లు వివరించింది. కాసా డిపాజిట్లు 5.35 గ్రోత్​ సాధించాయని తెలిపింది. గ్రాస్​ నాన్​పెర్​ఫార్మింగ్​ అసెట్లు మొత్తం లోన్​ బుక్​లో 3.52 శాతంగా ఉన్నట్లు ఎస్​బీఐ తెలిపింది. అంతకు ముందు ఏడాదిలోని 4.9 శాతంతో పోలిస్తే ఇవి తగ్గాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రొవిజన్లు కూడా తగ్గాయని ఎస్​బీఐ వెల్లడించింది. ఈ ప్రొవిజన్లు 25.5 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. 

లోన్లు భారీగా ఇస్తాం....
ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లో లోన్లలో రెండంకెల గ్రోత్​ అంటే 14–16 శాతం సాధించాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు ఎస్​బీఐ ఛైర్మన్​ దినేష్​ ఖారా వెల్లడించారు. తాజా క్వార్టర్​ మాకు బిజీ సీజన్​. అందుకే ఈ క్వార్టర్లో క్రెడిట్​ గ్రోత్​ బాగుంది. ఇదే ట్రెండ్​ కొనసాగితే తామనుకున్న టార్గెట్లు సాధించగలమనే దీమాను వ్యక్తం చేశారు. జులై–సెప్టెంబర్​ క్వార్టర్లీ రిజల్ట్స్​ ప్రకటన సందర్భంగా ఆయన శనివారం ముంబైలో  మీడియాతో మాట్లాడారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, రెన్యువబుల్​ పవర్​, ఆయిల్​ అండ్​ మార్కెటింగ్ కంపెనీలు, సర్వీసెస్​ సెక్టార్​లోని కంపెనీల నుంచి అప్పుల కోసం డిమాండ్​ పెరుగుతోందని ఖారా చెప్పారు. కొవిడ్​–19 సంక్షోభం నుంచి బ్యాంకులు బయటపడుతున్నట్లుగానే కనిపిస్తోందన్నారు.