రూ.10 వేల కోట్లు సేకరించిన ఎస్‌‌బీఐ

రూ.10 వేల కోట్లు సేకరించిన ఎస్‌‌బీఐ

న్యూఢిల్లీ: తమ నాల్గో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ఇష్యూ ద్వారా రూ.10 వేల కోట్లు సేకరించామని ఎస్‌‌బీఐ ప్రకటించింది.  ఈ బాండ్లపై 7.49 శాతం వడ్డీ (కూపన్ రేట్‌‌) ఇస్తోంది. హైవేలు, పైప్‌‌లైన్లు వంటి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌లకు లోన్లు ఇవ్వడానికి ఇటువంటి బాండ్లను ఇష్యూ చేస్తారు.  మొత్తం 134  బిడ్స్ వచ్చాయని ఎస్‌బీఐ  పేర్కొంది.