Jobs : SBIలో ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

Jobs : SBIలో ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీని అక్టోబర్ 21 వరకు  పొడిగించారు.   ఈ రిక్రూట్మెంట్ ద్వారా 45 కేటగిరీల్లో మొత్తం 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలను భర్తీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భావిస్తోంది. ఆసక్తి, అర్హత ఉండి, ఇప్పటివరకు ఈ పోస్ట్ లకు అప్లై చేయని అభ్యర్థులు వెంటనే ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లోని sbi.co.in/web/careers లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం.. మొదలైనవి ఒక్కో కేటగిరీకి ఒక్కో విధంగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ముందుగా sbi.co.in వెబ్ సైట్ లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

ముఖ్యమైన వివరాలు..

  • సెప్టెంబర్ 16 నుంచి అప్లకేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
  • అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 21 వరకు పొడిగింపు.
  • ఆన్ లైన్ ఎగ్జామ్ డిసెంబర్ చివర్లో కానీ, 2024 జనవరి మొదట్లో కానీ ఉంటుంది.
  • పరీక్షకు 10 రోజుల ముందు నుంచి sbi.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
  • అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ల ద్వారా చెల్లించవచ్చు.

అప్లై ఇలా చేయండి

  • ముందుగా sbi.co.in/web/careers వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
  • పైన కనిపించే join SBI ను క్లిక్ చేయండి. అనంతరం current openings ను క్లిక్ చేయండి
  • apply online పేజ్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి
  • అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ కాపీని ప్రింట్ తీసి పెట్టుకోండి.