
- డీల్ విలువ రూ.8,889 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ)కు రూ.8,889 కోట్లకు విక్రయించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించింది.
ఈ సమావేశంలో బ్యాంక్ సెంట్రల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను రూ.8,888.97 కోట్లకు విక్రయించడానికి ఆమోదం తెలిపిందని ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.