కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎస్సీ, ఎస్టీ కాన్ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజ్ వినతి

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎస్సీ, ఎస్టీ కాన్ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజ్ వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కొత్త పార్లమెంట్​ బిల్డింగ్​కు అంబేద్కర్ పేరు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆలిండియా ఎస్సీ, ఎస్టీ కాన్ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ కాన్ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు బుధవారం ఢిల్లీలో ఖర్గేను కలిశారు. అనంతరం తెలంగాణ భవన్​లో మహేశ్వర్ రాజ్ మాట్లాడారు. పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని 2020 నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. ఈ అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాసినా రిప్లే రాలేదన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చొరవ చూపాలని, శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని ఖర్గేను కోరామని చెప్పారు. ఎలక్షన్ మేనిఫెస్టోలోనూ కాంగ్రెస్  పార్టీ ఈ అంశాన్ని చేర్చాలన్నారు. తమ విజ్ఞప్తులపై ఖర్గే సానుకూలంగా స్పందించారని మహేశ్వర్ రాజ్ వెల్లడించారు.