ఇండియా పేరు మార్చాలని సుప్రీంలో పిటిషన్..జూన్ 2న విచారణ

ఇండియా పేరు మార్చాలని సుప్రీంలో పిటిషన్..జూన్ 2న విచారణ

ఇండియా పేరును భారత్ లేదా ఇందుస్తాన్ గా మార్చాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను జూన్ 2న విచారణకు రానుంది. దేశం పేరు మార్చడంతో ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయ భావం పెరుగుతుందని పిటిషనర్ తెలిపారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.1948 లోనే భారత్ లేదా హిందుస్తాన్ పేరు పెట్టాలని బలంగా వాదన విన్పించిన అంశాన్ని పిటిషన్ లో గుర్తు చేశారు.

వాస్తవానికి ఈ పిటిషన్ ఇవాళ( శుక్రవారం- (మే 29) సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ అయింది. అయితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్.ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిటిషన్ జూన్ 2వ తేదీన కోర్టు ముందుకు విచారణకు రానుంది.