హైదరాబాద్లో రీసైకిల్ ​ప్లాస్టిక్తో బ్యాగ్స్​కంపెనీ

 హైదరాబాద్లో రీసైకిల్ ​ప్లాస్టిక్తో బ్యాగ్స్​కంపెనీ

హైదరాబాద్, వెలుగు:రీసైకిల్డ్​ ప్లాస్టిక్​తో తయారు చేసిన స్కూల్ ​బ్యాగ్స్​, బ్యాక్​ప్యాక్స్​ను ఏస్‌‌ఫోర్ యాక్సెసరీస్ అనే స్టార్టప్  లాంచ్​చేసింది. మనదేశంలో ఇలాంటి బ్యాగులను మొట్టమొదటిసారిగా తామే అందుబాటులోకి తెచ్చామని ప్రకటించింది.  

అన్ని తరగతులు, కోర్సుల స్టూడెంట్ల అవసరాల కోసం వీటిని తయారు చేశామని తెలిపింది. తమ దగ్గర మొత్తం 27 రకాల ప్రొడక్టులు ఉన్నాయని ప్రకటించింది.  కంపెనీ సొంత ప్లాట్‌‌ఫారమ్ అప్పర్‌‌కేస్.కో.ఇన్​తోపాటు అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్, మింత్రా, రిటైల్ అవుట్‌‌లెట్‌‌లలో లభిస్తాయి. ధరలు రూ.1,800 నుంచి మొదలవుతాయి.