డ్రంకెన్ డ్రైవ్​లో చిక్కిన స్కూల్ బస్సు డ్రైవర్​

డ్రంకెన్ డ్రైవ్​లో చిక్కిన స్కూల్ బస్సు డ్రైవర్​

పటాన్ చెరు, వెలుగు: ప్రైవేటు స్కూల్​ బస్సు డ్రైవర్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒకవైపు ట్రాఫిక్​ పోలీస్ లు తనిఖీలు చేస్తున్నా.. స్కూల్​ బస్సు డ్రైవర్లు లెక్క చేయడం లేదు. స్కూల్ యాజమాన్యం డ్రైవర్ల పై నిఘా పెట్టడం లేదు. ఫలితంగా పిల్లల ప్రమాదాలకు కారణమవుతున్నారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు ట్రాఫిక్ , ఎంవీఐ  అధికారులు సంయుక్తంగా నవపాన్ ఎక్స్ రోడ్ వద్ద డ్రంకెన్​డ్రైవ్​తనిఖీలు నిర్వహించారు.  కర్దానూర్ గ్రామంలోని జీసస్ మేరీ హై స్కూల్ కు చెందిన బస్సు డ్రైవర్​మద్యం తాగి బస్సు నడుపుతూ పట్టుబడ్డాడు. అధికారులు బ్రీత్ ఎనలైజర్​ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దీంతో బస్సును సీజ్ చేసి, డ్రైవర్ గోపాల్ ను అదుపులో తీసుకున్నారు. కోర్టుకు తరలించనున్నట్టు ట్రాఫిక్ సీఐ తెలిపారు. సాయిరాం, గీత స్కూల్ కు సంబంధించిన బస్సులు ఫిట్​నెస్​ పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ వేణు కుమార్, రాజ్ మహమద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.