చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. ఇరుక్కుపోయిన విద్యార్థి

చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. ఇరుక్కుపోయిన విద్యార్థి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. నల్లవెల్లి గ్రామం నుంచి విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళ్తున్న బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సును వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. బస్సు చెట్టును ఢీకొట్టడంతో ఒక విద్యార్థి కాళ్లు బస్సు ఇంజిన్‌లో చిక్కుకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు ఎంత ప్రయత్నించినా విద్యార్ధి కాళ్లు బయటకు రాలేదు. దాంతో గ్యాస్ కట్టర్ తెచ్చి ఇంజిన్ కట్ చేసి గాయపడ్డ విద్యార్థిని బయటకు తీశారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

For More News..

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

మంత్రి బైకెక్కిన హీరోయిన్

జనవరి 26 సందర్భంగా తెలంగాణ యువకుడి ఘనత