తప్పిన ముప్పు.. బ్రిడ్జ్ పై నుంచి వాగులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

తప్పిన ముప్పు.. బ్రిడ్జ్ పై నుంచి వాగులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సుల్తాన్ పల్లిలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న బ్రిలియంట్ స్కూల్ బస్సు అదుపుతప్పి సుల్తాన్ పల్లి బ్రిడ్జ్ పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. దీన్ని వెంటనే గమనించిన స్థానికులు జేసీబీ సహాయంతో బస్సును బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

బస్సులోని విద్యార్థులను క్షేమంగా బయటికు తీశారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.