ప్రిన్స్ మీ వయసెంత.. చిన్నారి ప్రశ్నకు ఉలిక్కిపడ్డ చార్లెస్

ప్రిన్స్ మీ వయసెంత.. చిన్నారి ప్రశ్నకు ఉలిక్కిపడ్డ చార్లెస్

బిటన్ కింగ్ చార్లెస్ 3ను ఓ చిన్నారి అడిగిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కింగ్ చార్లెస్ మీ వయసు ఎంత అని అడిగిన చిన్నారికి ఆయన చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.  ఆ చిన్నారి ముద్దుముద్దుగా మాట్లాడుతూ అడిన ప్రశ్నకు అక్కడున్న టీచర్లు, చార్లెస్ తో సహా అంతా పక్కున నవ్వుకున్నారు. ఇంతకీ కింగ్ ఛార్లెస్ ఇచ్చిన సమాధానం వింటే ఇంకా ఆశ్యర్యంగా అనిపిస్తుంది. 

జీరో వాల్తామ్‌స్టోవ్‌ను సందర్శించడానికి చార్లెస్‌ 3 తూర్పు లండన్‌కి వెళ్లారు. అక్కడ ఆయన బార్న్‌ క్రాఫ్ట్‌ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులను కలిశారు. వారితో రాజు కాసేపు ఆనందంగా ముచ్చటించాడు. చార్లెస్‌ ఆ విద్యార్థులతో సెలవులు గురించి, లంచ్‌ సమయం గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశారు. ఈ చిన్నారుల్లో ఒకరు ప్రిన్స్‌ అంటూ జెండా ఊపుతూ చార్లెస్‌ని ఉత్సహాపరిచాడు. మరో చిన్నారి చార్లెస్‌ని మీ వయసు ఎంత అని అడగ్గా.. ఆయన తనదైన శైలిలో గెస్ చేయండి అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇలాంటి చమత్కర ప్రశ్నలకు తనదైన హాస్యాని​ చార్లెస్‌ పండించడం మొదటిసారి కాదు. ఇంతకుముందు కామెన్‌వెల్త్‌ గేమ్‌ 2022 ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి మనం బీర్‌ వద్దకు వెళ్లగలమా అని ప్రశ్నిస్తే ఇలానే హాస్యాన్ని పండించాడు.