హైదరాబాద్ లోని అన్ని స్కూల్స్ కు 2 రోజులు సెలవు

హైదరాబాద్ లోని అన్ని స్కూల్స్ కు 2 రోజులు సెలవు

హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని స్కూల్స్ కు సెలవు ప్రకటించారు కలెక్టర్. 29, 30 తేదీలు.. రెండు రోజులు అంటే.. బుధవారం, గురువారం రోజున.. అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారాయన. 

రెండు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించటానికి కారణం.. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్. 30వ తేదీ పోలింగ్ జరగనుంది. 12వ తేదీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పాఠశాలల్లోనే పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ రెండు రోజులు సెలవు ప్రకటించగా.. 30వ తేదీన ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా సెలవు ఇచ్చాయి యాజమాన్యాలు. ఆరోజు పోలింగ్ ఉండటం ఈ నిర్ణయం తీసుకున్నాయి.