సైన్స్​ఫెయిర్​లో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు

సైన్స్​ఫెయిర్​లో ఆకట్టుకున్న విద్యార్థుల  ప్రదర్శనలు

స్టూడెంట్లు వారిలో ఉన్న ప్రతిభను, క్రియేటివిటీని బయటపెట్టారు. మహబూబ్​నగర్​లోని ఫాతిమా స్కూల్​లో సోమవారం నిర్వహించిన సైన్స్​ఫెయిర్​లో ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇచ్చి శెభాష్​ అనిపించుకున్నారు.  ఆయా ఎగ్జిబిట్ల గురించి అందులోని  శాస్త్రీయ విషయాల గురించి  చక్కగా వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి 342  ఎగ్జిబిట్స్​ ప్రదర్శించారు. 

స్మార్ట్​ గ్లౌజ్​

హన్వాడ జడ్పీహెచ్​ఎస్​లో 9వ తరగతి చదువుతున్న అనూష ఈ స్మార్ట్​ గ్లౌజ్​ను తయారు చేసింది. ఇది డెఫ్​ అండ్​ డమ్​ వాళ్లకు పనికొచ్చే పరికరం. ఈ గ్లౌజ్​ను చేతికి తొడుక్కోవడం వల్ల మూగ, చెవిటి వాళ్లకు చుట్టూ వచ్చే శబ్దాలలో వైబ్రేటింగ్​ ద్వారా, పక్క పక్కనున్నవారు  మాట్లాడుకునే వాయిస్​ టెక్స్ట్​ద్వారా మెసేజ్​లు పంపుతుంది. దీన్ని ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు.  తయారీకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అనూష చెప్పింది.

ఎల్​పీజీ గ్యాస్​ లీకేజ్​ డిటెక్టర్​, ఆటోమెటిక్​ ఆఫ్​

మహబూబ్​నగర్​ మండలం ఎదిర జడ్పీహెచ్​ఎస్​లో టెన్త్​ క్లాస్​ స్టూడెంట్​కావ్య ఎల్పీజీ గ్యాస్​ లీకేజీ డిటెక్టర్​, ఆటోమేటిక్​ఆఫ్​ ప్రదర్శనను ఇచ్చింది. గ్యాస్​ప్రమాదాల నివారణకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఎలుకలు గ్యాస్​ పైపును కొరకడం వల్ల ఏర్పడే గ్యాస్​ లీకేజీ, పొయ్యిపై వంటలు చేస్తున్నప్పుడు నీళ్లు పొంగినప్పుడు, పాలు పొంగినప్పుడు ఏర్పడ గ్యాస్​ లీకేజీలను ఇది గుర్తిస్తుంది. అలారం మోగి, ఆటోమెటిక్​గా గ్యాస్​ ఆఫ్​ అవుతుంది.

కెనాల్స్​పై  సోలార్​ కరెంట్​

గండీడ్ మండలం కొమిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్​లో 9వ తరగతి చదువుతున్న కె.శివశంకర్​ కెనాల్స్​పై  సోలార్​కరెంట్​ ప్రజంటేషన్​ను ఇచ్చాడు. వన్​ మెగా యూనిట్​ కరెంటు ఉత్పత్తికి 9 మిలియన్ల నీటిని వాడాల్సి ఉంటుంది. సోలార్​ ప్యానల్స్​ను కెనాల్స్​పై ఏర్పాటు చేయడం వల్ల అటు కరెంటు తయారీతో పాటు ఇటు నీటి వృథాను అరికట్టవచ్చు.

టెక్నాలజీ, ఇన్నోవేషన్​

మహబూబ్​నగర్​ డైట్​ కాలేజీలో చదువుతున్న టి.పరిమళ టెక్నాలజీ, ఇన్నోవేషన్​ ప్రదర్శనను ఇచ్చారు. ఇందులో త్రీ ఆల్టర్నెటివ్​మెథడ్స్​తో ఓపెన్​ బోరు బావుల వద్ద జరిగే ప్రమాదాలను ముందస్తుగా గుర్తించవచ్చు. బోరు బావుల వద్ద సెన్సార్లు ఏర్పాటు చేయడం వల్ల.. బావుల వద్దకు పిల్లలు వస్తున్నారనే సమాచారం వారి తల్లిదండ్రులకు అలర్ట్​ మెస్సేజ్ పంపుతుంది. అలాగే ఓపెన్​ బోర్లలో నెట్​ ఏర్పాటు, బోర్​ వితౌట్​ కేజింగ్​ ఏర్పాటు చేయడం వల్ల చిన్న పిల్లలు ఓపెన్​ బోరు బావుల్లో పడిపోకుండా కాపాడొచ్చు.