సైంటిస్ట్​ జయంత్ నార్లికర్ కన్నుమూత

సైంటిస్ట్​ జయంత్  నార్లికర్ కన్నుమూత

పుణె: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ (87) కన్నుమూశారు. ఇటీవల తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న ఆయన మంగళవారం (May 20) పుణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నార్లికర్1938లో కొల్హాపూర్‌‌లో జన్మించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదివారు.

తన స్నేహితుడు హోయిల్‌‌తో కలిసి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా గ్రావిటేషన్ థియరీని అభివృద్ధి చేశారు. ఇది ఖగోళ శాస్త్ర ప్రపంచంలో ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. పుస్తకాలు, సైన్స్ ఫిక్షన్ కథల ద్వారా ఆయన సైన్సును సామాన్యులకు చేరువ చేశారు.

మరాఠీలో రాసిన ఆయన ఆత్మకథకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కలింగా ప్రైజ్ (1996), పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004) వంటి ప్రసిద్ధ అవార్డులు అందుకున్నారు.