సైంటిస్టులు ఓకే అనగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్

సైంటిస్టులు ఓకే అనగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్
  • దేశంలో వివిధ దశల్లో మూడు వ్యాక్సిన ట్రయల్స్
  • తక్కువ టైంలోనే ప్రతి ఒక్కరికీ పంపిణీ చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ
  • ప్రజలందరీకీ హెల్త్ కార్డ్…మెడికల్ సమాచారమంతా అందులోనే
  • ఆడపిల్లల పెళ్లిళ్ల వయసుపై స్టడీ నివేదిక రాగానే నిర్ణయం
  • ఇకపై మేక్  ఫర్ వరల్డ్ పైనా దృష్టి పెట్టాలని పిలుపు 
  • ఎర్రకోట నుంచి పాక్ ,చైనాకు  పరోక్షంగా హెచ్చరికలు

 

ఎర్రకోట సాక్షిగా కరోనా నుంచి కాశ్మీర్ దాకా..రామమందిరం నుంచి రైతుల దాకా..ఆడబిడ్డల నుంచి ఆర్మీదాకా ఎన్నెన్నో విషయాలపై  ప్రస్తావించారు ప్రధాని మోడీ. పంద్రాగస్టు  సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్లకు నివాళులర్పించారు.కరోనాకు వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాగానే తక్కువ టైంలోనే అందరీకి అందిస్తామన్నారు.130 కోట్ల మందికి పైగా ప్రజల సంకల్పంతో మన దేశం కరోనా వైరస్ పై విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ ఇస్తామని అది ప్రతి ఒక్క ఇండియన్ హెల్త్ అకౌంట్  మాదిరిగా పనిచేస్తుందని తెలిపారు. చొరబాట్లకు అక్రమణలకు పాల్పడుతున్న పాకిస్తాన్, చైనాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎల్ వోసీ నుంచి ఎల్ ఐసీ దాకా వారికి అర్థమయ్యే  భాషలోనే జవాబు చెప్పామన్నారు. ఇక ఆత్మనిర్భర్ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించేందుకకు రైతుల  ఎదుగుదల చాలా కీలకమని చెప్పారు.

కరోనా వైరస్ కంట్రోల్ కు సంబంధించి దేశంలో మూడు వ్యాక్సిన్ల ట్రయల్స్  వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి సైంటిస్టులు ఒకేచేయగానే భారీగా ఉత్పత్తి ప్రారంభిస్తాం.దేశంలో ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తామన్నారు  మోడీ.74వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి ,ప్రసంగించారు.

కరోనా వ్యా క్సిన్ అందుబాటులోకి రాగానే.. సాధ్యమై నంత తక్కువ టైమ్‌లో దేశంలోని ప్రతిఒక్కరికీ చేరేలా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేశామని మోడీ ప్రకటించారు. ‘‘ప్రజలంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా 3 కంపెనీలు తమ వ్యాక్సిన్లకు వివిధ దశల్లో ట్రయల్స్ చేస్తున్నాయి. మన ఎక్స్ పర్టులు, సైంటిస్టులు వాటికి ఆమోదం తెలపగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ప్రతిఒక్కరికి వ్యా క్సిన్ అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం’’ అని వెల్లడించారు.‘‘మనం సంక్షోభ సమయంలో ఉన్నాం. చాలా కుటుంబాలపై దీని ఎఫెక్ట్ పడింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 130కోట్ల మంది సంకల్పంతో ఈ మహమ్మారిని ఓడిస్తాం’’అని మోడీఅన్నారు.

ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డు

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం) ను ప్రధాని ప్రారంభించారు. టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఈ మిషన్‌.. మెడికల్, హెల్త్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందన్నారు. దేశ ప్ర జలందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామని, అందులో మొత్తం మెడికల్ ఇన్ఫర్మేషన్‌ ఉంటుందని తెలిపారు. డాక్టర్ దగ్గరికి గానీ, ఫార్మసీకిగానీ వెళ్నలి ప్రతిసారి ఆ సమాచారం కార్డులోఎంటర్ అవుతుందని చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై)’ పరిధిలోకి ఈ ఎన్‌డీహె చ్‌ఎం రానుందని వెల్లడించారు. ‘‘ఈ స్కీం కింద ప్రతి ఒక్కరికీ హెల్త్ ఐడీ ఇస్తాం. ఇది ప్రతి ఒక్క ఇండియన్ ‘హెల్త్ అకౌంట్’ మాదిరి పనిచేస్తుంది. ప్రతి టెస్టు, రోగ నిర్ధారణ, మెడికల్ రిపోర్టులు, వారికిచ్చే మెడి సిన్లతో సహా సమాచారమంతా ప్రతి పౌరుడి హెల్త్ ఐడీలో పొందుపరుస్తారు. అందులో పేర్కొన్న హెల్త్ సమస్యలను నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా పరిష్కరిస్తారు’’అని చెప్పారు.

 మేకిన్ ఇండియా నుంచి మేక్ ఫర్ వరల్డ్..

‘ఆత్మ నిర్భర్ భారత్’ ఇకపై ఒక పదమే కాదని, అది ఒక మంత్రంగా మారి ప్రజల ఇమాజినేషన్‌ను సొంతం చేసుకుంటుందని ప్రధాని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా దిగుమతులను తగ్గించాలని, ఎగుమతులను పెంచాలని మోడీ పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియా మంత్రంతో దేశం ముందుకు సాగాల్సి ఉంటుందని.. తర్వాత ‘మేక్ ఫర్ వరల్డ్’ వైపు దృష్టి పెట్టాలని చెప్పారు. మన దేశ పాలసీలు, ప్రాసెస్ లు, ప్రొడక్టులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని, అప్పుడే శ్రేష్టభారత్ ఆలోచన సాకారం అవుతుందన్నారు.

ఆడబిడ్డల పెండ్లి వయసులో మార్పులు

ఆడపిల్లల పెండ్లికి కనీస వయసు మార్చే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని మోడీ చెప్పారు. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆడపిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా కమిటీ స్టడీ చేస్తోందన్నారు. మహిళల ఆరోగ్యం, అభ్యున్నతి కోసం పాటు పడుతున్నట్టు మోడీతెలిపారు. ‘‘దాదాపు 5వేలకు పైగా జన్‌ ఔషధి కేంద్రాల ద్వారా పేద మహిళలకు 5కోట్లకు శానిటరీ ప్యాడ్లను రూపాయికే అందించాం . మహిళలు వాళ్ల కాళ్ళ మీద  వాళ్లు నిలబడేలా చర్యలు తీసుకున్నాం. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చట్టాలు తెచ్చాం’’అన్నారు.

రైతులే ముఖ్యం

రైతుల కోసం రూ. లక్ష కోట్లతో అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ఫండ్ ఏర్పాటు చేశామని మోడీచెప్పారు. ‘‘ఆత్మ నిర్భర్ అగ్రికల్చర్, ఆత్మ నిర్భర్ ఫార్మర్కుఇదే సరైన అవకాశం. మోడర్న్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను రైతులకు అందించేందుకు ఈ ఫండ్ ఏర్పాటు చేశాం. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ లక్ష్యాలను సాధించేందుకు రైతుల ఎదుగుదల చాలా ముఖ్యం. సబ్బులు, బట్టలు వంటి ఇతర ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు.ఇప్పుడు వాటిలాగే రైతులూ తమ ఉత్పత్తులను దేశం, ప్రపంచంలో ఎక్కడైనా, ఎంత ధరకైనా అమ్ముకునే స్వేచ్ఛను రైతులకు కల్పించాం’’అని మోడీ వివరించారు.

కాశ్మీర్ లో కొత్త శకం

ప్రస్తుతం కొనసాగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని మోడీ చెప్పారు. ఏడాది కింద ఆర్టికల్ 370ని రద్దు చేశాక కాశ్మీర్ అభివృద్ధి విషయంలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. లడఖ్ ను కార్బన్ న్యూట్రల్ రీజియన్ గా మార్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మోడీ చెప్పారు. ఆసియా సింహాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ లయన్ లను ప్రారంభిస్తోందని చెప్పారు. పొల్యూషన్ను తగ్గించేందుకు దేశంలోఎంపిక చేసిన 100 సిటీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు మోడీ చెప్పారు.

బోర్డర్ కు ఎన్ సీసీ కేడెట్స్

సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌సీసీని విస్తరిస్తున్నామని మోడీ చెప్పారు. సుమారు లక్ష మంది కొత్త ఎన్‌సీసీ కేడెట్స్  కు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

మన అభివృద్ధిని కరోనా ఆపలేదు

ఇండియా ఎకనమిక్ గ్రోత్ను పరుగెత్తించేందుకు ఆత్మనిర్భర్ భారత్ దోహదపడుతుందని మోడీ చెప్పారు. ఇండియాను కరోనా మహమ్మారి ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. 10 రోజుల కింద జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజను ప్రస్తావించారు. వందల ఏళ్లనాటి సమస్యను శాంతియుతంగా పరిష్కరించామన్నా రు. దేశ ప్రజలు చూపిన సంయమనం, వివేకం అద్భుతమని, ఇది భవిష్యత్తులో మాకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.