
భారత్‌లో అంతర్జాతీయ రక్షణ దళాల ‘స్కౌట్ మాస్టర్-2019’ క్రీడా పోటీలను రాజస్థాన్‌లో జైసల్మేర్‌లో నిర్వహించనుంది. జూలై 24 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న ఈ పోటీలను భారత రక్షణ దళాలకు చెందిన కోణార్క్ కాప్స్ నిర్వహిస్తున్నాయి. మొదటి సారి ఆతిథ్య భారత్ కూడా వీటిలో పాల్గొంటోంది. రష్యా, చైనా, కజకిస్థాన్, ఆర్యేనియా, జింబాబ్వే దేశాలకు చెందిన రక్షణ దళాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీల్లో మానవ రహిత యుద్ధ విమానాలు, పదాతి దళాల యుద్ధ వాహనాల విన్యాసాలు ప్రముఖంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.