బీచ్‌లో కారు షికారు.. సముద్రం తడాఖా

బీచ్‌లో కారు షికారు.. సముద్రం తడాఖా

నీళ్లతో ఆటలు ఆడొద్దు. బీచ్ లో బిత్తిరి వేషాలు వేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అంటుంటారు పెద్దలు. అలాకాదు.. మేం దూసుకెళ్తాం అనుకునేవాళ్లకు ఈ వీడియో ఓ పాఠం లాంటిదే.

మహారాష్ట్ర బీచ్ లో సేఫ్ జోన్ లో కాకుండా.. నీళ్లలోకి ఓ కారుతో వెళ్లారు కొందరు. అలల తాకిడిని తట్టుకుని డ్రైవ్ చేయాలనుకున్నారు. కానీ..  వారి గేమ్ రివర్సైంది. సముద్రం తడాఖా చూపింది. తీరంవైపు వేగంగా వచ్చిన అలలు.. కారును తమతో పాటు సముద్రంలోకి లాక్కుపోయాయి. లోపలున్నవాళ్లు నెత్తీ నోరూ బాదుకున్నారు. ఎలాగోలా కారు డోర్ తీసుకుని నీళ్లలోనే బయటకు దిగారు. ఒడ్డున ఉన్న మరికొందరు వారిని రక్షించారు.