
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో 15 మందిని చంపిన పులి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఇందుకోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ సెర్చింగ్ ప్రారంభించాయి. రోజు అడవిలో 40 కిలోమీటర్లు నడుస్తున్నామని, ఇప్పటివరకూ పులిని గుర్తించకపోయామన్నారు సిబ్బంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సెర్చింగ్ ఆపరేషన్ కు ఇబ్బందిగా మారుతున్నాయన్నారు. దాదాపు 150 కెమెరా ట్రాపులు ఉంచినట్లు చెప్పారు.