
వాషింగ్టన్: ప్రపంచం తన గతిని మార్చుకునే క్రమంలో చరిత్రాత్మక దిశకు దగ్గర్లో ఉందని అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ అన్నారు. అఫ్గానిస్థాన్‌లో యుద్ధాన్ని వీడి, దౌత్య శకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి యూఎన్ జనరల్ అసెంబ్లీలో బిడెన్ మాట్లాటారు. కరోనా వైరస్, వాతావరణ మార్పులు, సైబర్ దాడులను నివారించేందుకు ప్రపంచ దేశాధినేతలు కలసికట్టుగా పని చేయాలని బిడెన్ పిలుపునిచ్చారు. బాంబులు, బుల్లెట్లు.. భవిష్యత్తులో వచ్చే వేరియంట్స్ నుంచి కాపాడలేవన్నారు. సైన్స్ సహకారంతో కలసికట్టుగా వీటిని ఎదుర్కొవాలన్నారు.