ఫోన్‌పే ఐపీఓకి సెబీ అనుమతి..త్వరలో కొత్త DRHP దాఖలు

ఫోన్‌పే ఐపీఓకి సెబీ అనుమతి..త్వరలో కొత్త DRHP దాఖలు

న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందించే ఫోన్‌‌పే ఐపీఓకి సెబీ అనుమతి వచ్చింది. త్వరలోనే కొత్త డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో ఫ్రెష్​ఇష్యూ ఉండదు.  

పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలోనే  జరుగుతుంది. యూపీఐ మార్కెట్లో ఫోన్‌‌ పేకు 45 శాతం వాటా ఉంది. ఇది గత డిసెంబర్ నాటికి 9.8 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. 

2025 ఆర్థిక సంవత్సరం ఆదాయం 40 శాతం పెరిగి రూ.7,115 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో రూ.1,202 కోట్లుగా ఉండగా, నికరలాభం వార్షికంగా మూడు రెట్లు పెరిగి రూ.630 కోట్లకు చేరుకుంది.