కార్వీపై సెబీ వేటు..షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అటాచ్‌

కార్వీపై సెబీ వేటు..షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్  అటాచ్‌

న్యూఢిల్లీ : కార్వీ స్టాక్ బ్రోకింగ్,  దాని సీఎండీ పార్థసారథి షేర్లను,  మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌లను అటాచ్‌ చేయాలని సెబీ గురువారం ఆదేశించింది. పార్థసారథి పెనాల్టీ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) దుర్వినియోగం చేసి ఖాతాదారుల నిధులను వాడుకున్న కేసులో 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని కార్వీ, పార్థసారథిలకు  ఆగస్టు 7న సెబీ నోటీసు పంపింది. 

 సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో సంస్థలు విఫలమవడంతో నోటీసు వచ్చింది.  హైదరాబాద్​కు చెందిన కేఎస్​బీఎల్​ను​, పార్థసారథిని  మార్కెట్ నుంచి ఏడేళ్ల పాటు నిషేధించింది.  రూ. 21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది.

మరిన్ని వార్తలు