తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వికాస్ రాజ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వికాస్ రాజ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ ఉత్తర్వలు జారీ చేశారు. ఇంతకు ముందు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన శశాంక్ గోయల్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో 1992 బ్యాచ్ కు చెందిన వికాస్ రాజ్ ను నిమించారు. ఈయన  ప్రస్తుతం తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను కేంద్రం తెలంగాణ కేడర్ కు ఎంపిక చేసింది.  ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గా, ఇతర హోదాల్లో పనిచేశారు.

 

ఇవి కూడా చదవండి

హొలీ సందర్భంగా 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

నేరుగా ఇంటికే ఉల్లిగడ్డలు

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు