ఐఆర్ఆర్ కేసులో రెండో రోజు ముగిసిన లోకేష్ విచారణ

ఐఆర్ఆర్ కేసులో రెండో రోజు ముగిసిన లోకేష్ విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో  రెండో రోజు  లోకేష్  విచారణ ముగిసింది.  హెరిటేజ్ ఫుడ్స్  భూముల కొనుగోలు, జీఓఎం ,ఐఆర్ఆర్ అలైన్ మెంట్ మార్పు తదితర అంశాలపై లోకేష్ పాత్రపై  సీఐడీ ఆరా తీసింది. సీఐడీ అధికారులు ఈరోజు ( అక్టోబర్ 11) ఆరు గంటల పాటు విచారించారు. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ను సీఐడీ ఏ 14 గా నమోదు చేసింది.  

 ALSO READ : చంద్రబాబుకు రిలీఫ్.. ఆ కేసులో ముందస్తు తాత్కాలిక బెయిల్

విచారణ అనంతరంల లోకేష్ మీడియాతో మాట్లాడుతూ నిన్న ( అక్టోబర్ 10) అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగార్నారు.   కొత్తగా ఎలాంటి ఆధారాలు చూపలేదని .. తన తల్లి  భువనేశ్వరి ఐటీ  రిటన్స్ చూపించారని తెలిపారు.   నా తల్లి భువనేశ్వరి ఐటీ రిటన్స్ మీ దగ్గరకు ఎలా వచ్చాయని తాను సీఐడీ అధికారులను అడిగినట్లు తెలిపారు.  47 ప్రశ్నలు అడిగి విచారణ ముగించారనన్నారు. తనను మళ్లీ విచారణకు రమ్మనలేదన్నారు.