
లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రారంభంలో నెమ్మదిగా సాగిన పోలింగ్ క్రమంగా పెరుగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు.
ఉదయం 11 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ …ఉత్తర ప్రదేశ్‌లో 24.31శాతం, బీహార్‌లో 18.97శాతం, మణిపూర్‌లో 32.18శాతం, తమిళనాడులో 30శాతం, కర్ణాటక 19.81 శాతం, పశ్చిమ బెంగాల్ 33.45 శాతం, ఒడిశా 18 శాతం, అస్సాంలో 26.39శాతం, ఛత్తీస్ గఢ్‌లో 26.2శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.