96 సెగ్మెంట్లు.. 12 రాష్ట్రాలు..: రేపే సెకండ్ ఫేజ్ పోలింగ్

96 సెగ్మెంట్లు.. 12 రాష్ట్రాలు..: రేపే సెకండ్ ఫేజ్ పోలింగ్

ఢిల్లీ : 96 లోక్ సభ నియోజకవర్గాలు.. 12 రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతం. రేపటి రెండో విడత లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఈక్వేషన్ ఇది. దేశమంతటా రేపు రెండో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రచారం నిన్న మంగళవారం సాయంత్రంతో ముగిసింది.

అస్సాంలో 5, బిహార్ లో 5, చత్తీస్ గఢ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 2, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, మణిపూర్ లో 1, ఒడిశాలో 5, తమిళనాడులో 37, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్ లో 8, బెంగాల్ లో 3, పుదుచ్చేరిలో 1 స్థానానికి 18న పోలింగ్ నిర్వహిస్తున్నారు.

తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకు రెండో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా… వెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. అక్కడ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడడంతో పోలింగ్ రద్దు చేసినట్టు తెలిపింది.

తమిళనాడు అసెంబ్లీలోని 18 నియోజకవర్గాలకు ఉపఎన్నికలు కూడా రేపే జరగనున్నాయి.

ఒడిశా అసెంబ్లీలోని 35 నియోజకవర్గాలకు కూడా రెండో విడతలోనే పోలింగ్ జరగనుంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23న రానున్నాయి.