ప్రమోషన్ల కోసం సెక్రటేరియట్ ఉద్యోగుల నిరసన

ప్రమోషన్ల కోసం సెక్రటేరియట్ ఉద్యోగుల నిరసన

హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు కల్పించాలని సీఎస్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు ప్రమోషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెంటనే తమకు ప్రమోషన్లు ఇవ్వాలని సీఎస్ చాంబర్ ముందు నినాదాలు చేశారు.