ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ముంబైలో 144 సెక్షన్ పొడిగింపు

ఒమిక్రాన్ ఎఫెక్ట్..  ముంబైలో 144 సెక్షన్ పొడిగింపు

ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండంతో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముంబైలో 144 సెక్షన్ ను జనవరి 15 వరకు పొడిగించింది. బీచ్లు, ఓపెన్ గ్రౌండ్ లు, సముద్రతీర ప్రాంతాలు, పార్కుల్లో జనం ఎంట్రీపై సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నిషేధం విధించినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడంపైనా ఆంక్షలు విధించారు. ఈ  ఉత్తర్వులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం..

బట్టలపై జీఎస్టీ పెంపు వాయిదా

ప్రభుత్వం దగ్గర ఉద్యోగుల లిస్ట్ కూడా సరిగా లేదు