ప్రభుత్వం దగ్గర ఉద్యోగుల లిస్ట్ కూడా సరిగా లేదు

ప్రభుత్వం దగ్గర ఉద్యోగుల లిస్ట్ కూడా సరిగా లేదు

ఉద్యోగుల  బదిలీలపై  ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు  చేశారు. రాష్ట్ర ప్రభుత్వ  తీరుతో  ఉద్యోగులు, టీచర్లు మనోవేదనకు  గురి అవుతున్నారని ఆమెకు  వివరించారు. 317  జీవో సవరించాలని  గవర్నర్ ను  కోరారు. ఉద్యోగుల  ఇబ్బందులు తెలుసుకోవాలనే  ఆలోచన సీఎంకు లేదని    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సీనియార్టీ  లిస్ట్ సరిగా లేదని ఆయన అన్నారు. వికలాంగుల  ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడంలేదని సంజయ్ విమర్శించారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, నేతలు ప్రేమేందర్ రెడ్డి, దేవిప్రసాద్, తదితరులు ఉన్నారు.

‘ప్రభుత్వం ఆదరాబాదరాగా జారీ చేసిన 317 జీవోను రద్దు చేయాలి. ఉద్యోగుల సమస్యలు తెలుసుకునే సమయం కూడా సీఎంకు లేదు. ప్రభుత్వం దగ్గర సీనియారిటీ లిస్ట్ సరిగాలేదు. బదిలీలతో ఉద్యోగుల కుటుంబాలు కన్నీంటిపర్యంతమవుతున్నాయి. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేస్తేనే మీరు సీఎం అయ్యారనే విషయం మరచిపోకండి. వారి వల్లే ఆ సమ్మె దేశాన్ని ఆకర్షించింది. అటువంటి ఉద్యోగుల మీద మీకేందుకు కక్ష. ఉద్యోగుల ఉసురు ఊరికేపోదు కేసీఆర్. మీ తీరుతో ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయడానికి భయపడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఉద్యోగసంఘాలతో చర్చలు జరపాలి. ఉద్యోగస్తులు ధైర్యంగా ఉండాలి. సీఎం దిగొచ్చేవరకు మీకు బీజేపీ అండగా ఉంటుంది’ అని సంజయ్ భరోసానిచ్చారు.

For More News..

కేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా? 

ముఖంపై టాటూతో న్యూస్​ రీడర్