మోడీ ప్రారంభించనున్న సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రత్యేకతలివే

మోడీ ప్రారంభించనున్న సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రత్యేకతలివే

ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు శనివారం నుంచి పరుగులు తీయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8వ తేదీ శనివారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య 'వందే భారత్‌' రైలు వారానికి ఆరు రోజులు నడవనుంది. అయితే తొలి రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

తొలి రోజు సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి తిరుపతికి రాత్రి 9.00 గంటలకు చేరుకుంటుంది. తొలిరోజు మాత్రం చర్లపల్లి 11.45, నల్గొండ 13.05, మిర్యాలగూడ 13.40, పిడుగురాళ్ల 14.30, గుంటూరు 15.35, తెనాలి 16.15, బాపట్ల 16.50, చీరాల 17.10, ఒంగోలు 17.50, నెల్లూరు 19.10, గూడూరు 19.35, తిరుపతి 21.00 గంటలకు ట్రైన్ చేరుతుంది. వందేభారత్‌ 16 కోచ్‌ల రైలులో ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌, సాధారణ చైర్‌కార్‌ బోగీలు ఉంటాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం తగ్గనుంది.

ఈ నెల 9వ తేదీ నుంచి 'వందేభారత్‌' రైలు నంబరు 20702 తిరుపతిలో 15.15 గంటలకు బయలుదేరి నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45 గంటలకు చేరుకుంటుంది. 10వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లో 06.00 గంటలకు బయలుదేరే రైలు(20701) నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30 గంటలకు చేరుతుంది. ఇటీవల ఈ మార్గంలో టికెట్ల ధరల వివరాలను ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్–తిరుపతి, తిరుపతి–సికింద్రాబాద్ రూట్లలో టికెట్ల రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.

సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..

  • నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం
  • వందే భారత్ ట్రైన్‌ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం
  • దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ.
  • 1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు
  • ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు
  • తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు
  • వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్ల ధరలు ఇలా..

  • సికింద్రాబాద్ నుంచి నల్గొండ –రూ.900
  • సికింద్రాబాద్ నుంచి గుంటూరు –రూ.1620
  • సికింద్రాబాద్ నుంచి ఒంగోలు –రూ.2045
  • సికింద్రాబాద్ నుంచి నెల్లూరు –రూ.2455,
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి –రూ.3080

ఛైర్‌ కార్‌ టికెట్ల ధరలు ఇలా..

  • సికింద్రాబాద్ నుంచి నల్గొండ –రూ.470
  • సికింద్రాబాద్ నుంచి గుంటూరు –రూ.865
  • సికింద్రాబాద్ నుంచి ఒంగోలు –రూ.1075
  • సికింద్రాబాద్ నుంచి నెల్లూరు –రూ.1270
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి –రూ.1680