సికింద్రాబాద్ టూ బెనారస్ ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ టూ బెనారస్ ప్రత్యేక రైళ్లు

దీపావళి పండుగ సీజన్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ టూ బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లును నడపనుంది. స్లీపర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్ లను రైళ్లులో అందించనున్నామని తెలిపింది. ఈ రైళ్లను నవంబర్ 15 నుంచి 22 తేదీ వరకు నడువనున్నాయని రైళ్వే శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం రైలు నంబర్లు, అవి బయలుదేరే సమయాన్ని అధికారులు ప్రకటించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.     

  • రైలు నంబర్ 07005 (సికింద్రాబాద్ - బనారస్) సికింద్రాబాద్ నుంచి రాత్రి 9:40 గంటలకు బయలుదేరి.. నవంబర్ 15, 22 తేదీలలో ఉదయం 6:30 గంటలకు బనారస్ చేరుకుంటుంది.
  • అదే విధంగా, రైలు నెం 07006 (బనారస్ - సికింద్రాబాద్) బనారస్ నుంచి ఉదయం 8:35 గంటలకు బయలుదేరి.. నవంబర్ 17, 24 తేదీలలో సాయంత్రం 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
  • ఈ రైళ్లు జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, అలాగే ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లలో రెండు దిశలలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.