నార్త్ బ్లాక్ వద్ద బడ్జెట్‌ కు భారీ భద్రత

నార్త్ బ్లాక్ వద్ద బడ్జెట్‌ కు భారీ భద్రత

న్యూఢిల్లీకేంద్ర ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ దగ్గర సెక్యూరిటీని పెంచారు.   రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌‌  తొలిసారి బడ్జెట్‌‌కు  ప్రిపరేషన్లు మొదలుపెట్టింది. ఫైనాన్సీ మినిస్ట్రీ ఉన్న నార్త్‌‌ బ్లాక్‌‌ దగ్గర  భద్రతను కట్టదిట్టం చేశారు. జులై ఐదున బడ్జెట్‌‌ ప్రవేశపెట్టేదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.నార్త్‌‌ బ్లాక్‌‌   దగ్గర విజిటర్లు, మీడియాపై విధించిన ఆంక్షలు  సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. 2019–-20 బడ్జెట్‌‌ ప్రవేశపెట్టే వరకు ఈ  ఆంక్షలు కొనసాగుతాయి.  లోక్‌‌సభ ఎన్నికల కారణంగా గత ఫిబ్రవరి ఒకటిన బీజేపీ సర్కార్‌‌ ఇంటెరమ్‌‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు కేంద్రంలో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడడంతో  కొత్త ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌   బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌‌పై  కసరత్తు రహస్యంగా జరుగుతుంది. అందుకోసం నార్త్‌‌బ్లాక్‌‌  దగ్గర ఎలక్ట్రానిక్‌‌ పరికరాలను అమర్చారు.  మినిస్ట్రీలో  ఉండే కంప్యూటర్లలో  ప్రైవేట్‌‌ ఈమెయిల్‌‌ సర్వీసుల్ని బ్లాక్‌‌ చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్‌‌ పాయింట్ల దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని ఉంచారు. బడ్జెట్‌‌ తయారీలో పాలుపంచుకుంటున్న  సిబ్బంది గదుల్లోకి వచ్చిపోయేవారి మూమెంట్స్‌‌ను దగ్గరగా అబ్జర్వ్‌‌ చేసేందుకు  ఇంటిలిజెన్స్‌‌ బ్యూరో  సిబ్బందిని నియమించారు. వీళ్లకు ఢిల్లీ పోలీసులు సాయపడుతున్నారు. 17వ లోక్‌‌సభ సమావేశాలు ఈనెల 17 నుంచి జులై 26 వరకు కొనసాగుతాయి. 2019-–2020 ఎకనమిక్‌‌ సర్వేను జులై నాలుగున, బడ్జెట్‌‌ను ఆ తర్వాతి రోజన నిర్మలా సీతారామన్‌‌ ప్రవేశపెట్టనున్నారు.