చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలో మావోయిస్టుల.. డంప్‌‌ స్వాధీనం చేసుకున్న భద్రతాబలగాలు

చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలో మావోయిస్టుల.. డంప్‌‌ స్వాధీనం చేసుకున్న భద్రతాబలగాలు

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధి ముసలిమడుగు అడవుల్లో మావోయిస్టుల డంప్‌‌ను బుధవారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌‌లు దాడులకు ప్లాన్‌‌ చేశారన్న సమాచారం అందడంతో సుక్మా డీఆర్జీ, సీఆర్‌‌పీఎఫ్‌‌ బలగాలను రంగంలోకి దించారు. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. మావోయిస్ట్‌‌లు దాచిన డంప్‌‌ను గుర్తించిన భద్రతాబలగాలు దానిని స్వాధీనం చేసుకొని బెజ్జి పోలీస్‌‌ స్టేషన్‌‌కు తరలించారు.

 15 కిలోల అమ్మోనియం నైట్రేట్‌‌ పౌడర్‌‌, ఎలక్ట్రిక్‌‌ డిటోనేటర్లు 30, జిలెటిన్‌‌ స్టిక్స్‌‌ 26, క్లైమోర్‌‌ మైన్‌‌పైపులు మూడు, 100 మీటర్ల విద్యుత్‌‌ వైరు, 8 లైమ్‌‌ బాక్సులు, పెద్ద ప్లాస్టిక్‌‌ కంటెయినర్‌‌తో ఇతర నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్‌‌ చౌహాన్‌‌ తెలిపారు.