
బెల్లంపల్లి, వెలుగు: లైసెన్స్ ఉన్న షాపుల నుంచే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని బెల్లంపల్లి ఏడీఏ సురేఖ సూచించారు. ఆదివారం బెల్లంపల్లి మండలంలోని అకెనపల్లిలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖల అధికారులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తీసుకోవాలని, పంట అమ్ముకునే వరకు భద్రపరచుకోవాలన్నారు. ఏవో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. నిషేధిత గ్లైసీల్ పత్తి, గ్లైఫోసెట్ కలుపు మందుల వాడితే పంటల భూములకు, రైతుల ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.
అనంతరం గ్రామంలో రైతులతో చర్చించారు.
కార్యక్రమంలో తాళ్లగురిజాల ఎస్సై, ఎంపీవో శ్రీనివాస్, ఏఈవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.