ఇస్రో సైంటిస్టులకు.. శ్రీ చైతన్య విద్యాసంస్థల అభినందన

ఇస్రో సైంటిస్టులకు..  శ్రీ చైతన్య విద్యాసంస్థల అభినందన

హైదరాబాద్, వెలుగు: చంద్రయాన్​–3 సక్సెస్ అయిన నేపథ్యంలో ఇస్రో సైంటిస్టులకు శ్రీ చైతన్య విద్యాసంస్థల  డైరెక్టర్ సీమా అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ఇది ఒక మరపురాని విజయ మని, మంగళ్ యాన్, చంద్రయాన్ 1, 2ను స్ఫూర్తిగా తీసుకుని ఇస్రో సైంటిస్టులు నిరంతరాయంగా చేసిన కృషికి ఇది నిదర్శనమని ఆమె తెలిపారు. ఇస్రో చేపట్టిన మంగళయాన్, చంద్రయాన్ 1, 2, 3 మిషన్ల స్ఫూర్తితో శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్లు.. నాసా ఎన్​ఎస్ఎస్ స్పేస్ సెటిల్​మెంట్ కాంటెస్టులో పాల్గొని విజయాలను సాధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.  

ఇందులో 54 విన్నింగ్ ప్రాజెక్టులు, 5 వరల్డ్ ఫస్ట్ ప్రైజెస్, 3 రివార్డ్ విన్నింగ్ స్కాలర్​షిప్​లను  గెలుచుకొని రికార్డు సృష్టించామన్నారు. నాసా ప్రతి ఏడాది నిర్వహించే ఐఎన్డీసీ కాన్ఫరెన్స్​కు పదేండ్లుగా రికార్డు స్థాయిలో శ్రీ చైతన్య స్కూల్ నుంచి స్టూడెంట్ల ఎంపిక జరుగుతోందన్నారు.  ఈ ఏడాది డల్లాస్ లో జరిగిన ఐఎన్డీఎస్ కాన్ఫరెన్స్ కు  తమ స్కూల్ నుంచి 110 మంది స్టూడెంట్లు హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. చంద్రయాన్​–3 సక్సెస్​తో గురువారం శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్లు విజయోత్సవ ర్యాలీలు తీశారు.