
సుమన్, గరిమా చౌహన్ హీరో హీరోయిన్లుగా సతీష్ పరమవేద తెరకెక్కిస్తున్న చిత్రం 'సీతా కళ్యాణ వైభోగమే'. రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిన్న అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలయ్యింది. ఫస్ట్ షాట్‌కి నిర్మాత 'దిల్' రాజు క్లాప్ కొట్టారు. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అతిథులుగా హాజరై టీమ్‌కి విషెస్ చెప్పారు. దిల్ రాజు సంస్థలో తాను పని చేశానని, ఈ మూవీ ఆయన స్టైల్లోనే ఉంటుందని చెప్పిన దర్శకుడు.. ఇదో మంచి ఫ్యామిలీ స్టోరీ అని, రామాయణానికి ప్రణయ్–అమృతల ప్రేమకథ, మారుతీరావు ఇష్యూని మిక్స్ చేసి తీస్తున్నట్లు చెప్పాడు.