కారులో తరలిస్తున్న రూ.35 లక్షలు సీజ్

కారులో తరలిస్తున్న రూ.35 లక్షలు సీజ్

కరీంనగర్​ రూరల్​, వెలుగు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.35 లక్షల నగదును పోలీసులు సీజ్  చేశారు. కరీంనగర్​ రూరల్​ మండలం బొమ్మకల్​ గ్రామ పరిధిలోని గుంటూరుపల్లి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న రూ.35లక్షల నగదు దొరికింది. దీంతో ఆ నగదును సీజ్​ చేశామని రూరల్​ పోలీస్​ స్టేషన్​ సీఐ ప్రదీప్​ కుమార్​ తెలిపారు. 

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన పొల్సాని అనీల్​రావు, దుగ్యాల సంతోష్​రావు, పాలేపు సుధాకర్, తుర్కలమద్దికుంటకు చెందిన ముత్యాల నరేష్​ ఓ కారులో ఆ నగదును తరలిస్తుండగా పట్టుకున్నామని సీఐ చెప్పారు .నగదుకు సంబంధించి ఆధారాలు చూపించకపోవడంతో క్యాష్ సీజ్​ చేసి డిస్ట్రిక్  గ్రీవెన్స్​ కమిటీకి అప్పగించిచామని వెల్లడించారు.