యానివర్సరీ ఆఫర్లు ప్రకటించిన సెల్‌‌‌‌బే

యానివర్సరీ ఆఫర్లు ప్రకటించిన సెల్‌‌‌‌బే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లను అమ్మే రిటైల్ చెయిన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ సెల్‌‌‌‌‌‌‌‌బే యానివర్సరీ సందర్భంగా వివిధ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు  రూ. 15 వేలు కంటే ఎక్కువ విలువైన  స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తే బ్లూటూత్ ఇయర్ బడ్స్‌‌‌‌‌‌‌‌ను రూ. 99 కే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని సెల్‌‌‌‌‌‌‌‌బే అందిస్తోంది. లేదా కస్టమర్లు ఒక గోడ గడియారంతో పాటు మరో రెండు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 
10 వేల ఎంఏహెచ్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లేదా 6,000 ఎంఏహెచ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ లేదా నెక్‌‌‌‌‌‌‌‌ బ్యాండ్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌బడ్స్‌ లేదా రూ. 499 కే స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌..ఈ నాలుగింటిలో ఒక ఐటెమ్‌‌‌‌‌‌‌‌ను రెండో  గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కింద కస్టమర్లు ఎంచుకోవచ్చు. మూడో గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కింద  స్క్రీన్‌‌‌‌‌‌‌‌ గార్డ్‌‌‌‌‌‌‌‌  లేదా వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్ ఫోన్‌‌‌‌‌‌‌‌లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశాన్ని ఈ సంస్థ అందిస్తోంది. 

రూ. 15 వేలు కంటే తక్కువ విలువైన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లు రెండు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లను దక్కించుకోవచ్చు. మొదటి గిఫ్ట్ కింద గోడ గడియారం లేదా నెక్‌‌‌‌‌‌‌‌బ్యాండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బడ్స్‌‌‌‌‌‌‌‌ లేదా రూ. 499 కే స్మార్ట్‌‌‌‌‌‌‌‌వాచ్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకునే అవకాశం..ఈ మూడింటిలో ఒక గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. రెండో గిఫ్ట్ కింద స్క్రీన్ గార్డ్‌‌‌‌‌‌‌‌ లేదా వైర్ ఇయర్ ఫోన్‌‌‌‌‌‌‌‌ను పొందొచ్చు. కస్టమర్లు ఏ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ కొన్నా  కచ్చితంగా గిఫ్ట్స్‌‌‌‌‌‌‌‌ పొందొచ్చని సెల్‌‌‌‌‌‌‌‌బే ప్రకటించింది. 

యాక్ససరీలపై 70 శాతం వరకు డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌ను కూడా అందిస్తున్నామని తెలిపింది. ఇంకా మరిన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నామని వివరించింది.  సెల్‌‌‌‌‌‌‌‌బే యానివర్సరీ ఈవెంట్ ఈ నెల 18 న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరగగా, కంపెనీ ఎండీ నాగరాజు సోమ, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ) సుహాస్‌‌‌‌‌‌‌‌ నల్లచెరు, వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ క్రిష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ చెరుకు, సెల్‌‌‌‌‌‌‌‌బే ఉద్యోగులందరూ పాల్గొన్నారు.