రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదిలాబాద్ జట్టు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదిలాబాద్ జట్టు ఎంపిక

బెల్లంపల్లి, వెలుగు :  స్కూల్ గేమ్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ జీఎఫ్) అండర్ 19 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి వాలీబాల్ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం బెల్లంపల్లి సీఓఈలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కన్వీనర్ బొంకూరి బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె.సమ్మయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గెలుపే ధ్యేయంగా ప్రతి క్రీడాకారుడు రాణించాలన్నారు.

ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు అత్యంత ప్రతిభ కనబర్చి ఈ నెల 10 నుంచి12వ తేదీ వరకు సిద్దిపేటలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ అవునూరి అంజయ్య, స్వరూప, ఎస్ జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బి.బాబురావు, పీఈటీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.