హైదరాబాద్ లో సెల్ఫీ మ్యూజియమ్స్

హైదరాబాద్ లో సెల్ఫీ మ్యూజియమ్స్

ఇపుడంతా సెల్ఫీ క్రేజ్ నడుస్తోంది. చిన్నా, పెద్దా అంతా సెల్ఫీ మోజులో పడిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నా.. సెల్ఫీ తీసుకోవడం, దాన్ని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ గా మారింది. సెల్ఫీ లవర్స్ కోసం సిటీలో సెల్ఫీ  మ్యూజియమ్స్ ఏర్పాటవుతున్నాయి. ఏ చిన్న అకేషన్ ఉన్నా సెల్ఫీ మ్యూజియానికి క్యూ కడుతున్నారు.

అంతా సెల్ఫీ మయం

ప్రపంచమంతా రీల్స్, సెల్ఫీ మయమైంది. ఎవరిని చూసినా.. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా.. అంతా ఇదే హడావిడి నడుస్తోంది. డిఫరెంట్ స్టైల్లో ఫొటో దిగడం పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. తమ స్టైల్ ని, ఫ్యాషన్ ని నలుగురితో ఇలా షేర్ చేసుకోవడం ట్రెండ్ గా మారింది. కామెంట్స్, కాంప్లిమెంట్స్ కొట్టేయడానికి ఫేస్ బుక్ లో అప్లోడ్, వాట్సాప్ లో స్టేటస్, ఇన్ స్టాలో స్టోరీ, రీల్స్ లాంటివి పెడుతున్నారు. దీంతో ఇపుడు రీల్స్ సెల్ఫీస్ కి మస్త్ క్రేజ్ పెరిగింది. వ్యాపారులు పబ్లిక్ క్రేజ్ ను బిజినెస్ గా మార్చుకొంటున్నారు. కొంత ప్లేస్ లోనే 20 బ్యాక్ గ్రౌండ్స్, అద్భుతమైన కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ గా సెల్ఫీ మ్యూజియం ఏర్పాటు చేశారు.

సెల్ఫీ మ్యూజియం

ఇండియాలోనే మొదటి సారిగా మన హైదరాబాద్ శామీర్ పేట్ దగ్గరలో సెల్ఫీ మ్యూజియం ఏర్పాటైంది. దీంతో పబ్లిక్ ఈ సెల్ఫీ మ్యూజియంతో ఎంజాయ్ చేస్తున్నారు. మంచి, మంచి ఫోజులు, స్టిల్స్ తో డిఫరెంట్ గా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. యూత్ నుంచి చిన్న పిల్లల వరకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి టైం పాస్ చేస్తున్నారు. క్రేజీ, క్రేజీగా తీరొక్క బ్యాక్ గ్రౌండ్ లో ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసుకుంటున్నారు.

యూత్ లైఫ్ స్టైల్లో సెల్ఫీలు ఓ పార్ట్

సెల్ఫీకి ఉన్న క్రేజ్ తో ఇదే బిసినెస్ మారిందని సెల్ఫీ మ్యూజియం నిర్వాహకులు అంటున్నారు. ప్రజెంట్ యూత్ లైఫ్ స్టైల్లో సెల్ఫీలు ఓ పార్ట్ అయ్యాయని అంటున్నారు. ఫోటోకి మస్ట్ అండ్ శుడ్ బ్యాక్ గ్రౌండ్ అని.. అందుకే డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ తో సెల్ఫీ మ్యూజియం మొదలు పెట్టామంటున్నారు. గంటకు ఒక్కరికి 500 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఐతే గంటకు 12 వందల తీసుకుంటున్నారు. ట్రెండ్ ఏదైనా దాన్ని ఓన్ చేసుకొని బిజినెస్ గా మలుచుకుంటున్నారు చాలామంది. ప్రస్తుతం ఉన్న సెల్ఫీ, రీల్స్ క్రేజ్ ని సెల్ఫీ మ్యూజియం నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు.