కంటి వెలుగు కార్యక్రమాన్ని విమర్శిస్తూ డాక్టర్ సెల్ఫీ వీడియో

కంటి వెలుగు కార్యక్రమాన్ని  విమర్శిస్తూ  డాక్టర్ సెల్ఫీ వీడియో

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంపై ఓ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగు కార్యక్రమంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. కంటివెలుగు క్యాంపుల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని వైద్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా స్టాప్ ను పని చేయమనడం ఎంతవరకు సమంజసమని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం వైద్యుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మొదటి విడత కంటి వెలుగు

కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటిసారిగా 2018 ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మలాపూర్‌లో ప్రారంభించారు. ఐదు నెలల పాటు కొనసాగిన ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది. పథకంలో భాగంగా కళ్లద్దాలు, మందులు, ఎంతో మందికి ఆపరేషన్లు కూడా నిర్వహించింది.  నాలుగేండ్ల తర్వాత రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి నెలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదలు పెట్టారు.